ఫోన్ రీచార్జ్ చేస్తే… బీమా వస్తుంది ఎలా అంటే…!

-

కరోనా పుణ్యమా అని ఇప్పుడు జనాలు నెట్ ని ఎక్కువగా వాడుతున్నారు. యుట్యూబ్ లో వీడియోలు, సోషల్ మీడియాలో వీడియో లు చూడటం వంటివి చేస్తున్నారు. దీనితో నెట్ వాడకం అనేది బాగా పెరిగింది. కనీసం ఒక జీబీ నెట్ అనేది అయిపోతుంది ప్రతీ రోజు కూడా. దీనితో ఇప్పుడు ఎక్కువగా జనాలు డైలీ వచ్చే ఆఫర్లను వాడుతున్నారు. రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ప్లన్స్ ఒకసారి చూడండి.

రిలయెన్స్ జియోలో; అన్నింటికన్నా తక్కువగా రూ.199 ధరకే రీఛార్జ్ ప్లాన్ ఇస్తూ వస్తుంది. దీనితో మీకు ప్రతీ రోజు 1.5 జీబీ నెట్ వస్తుంది. రిలయెన్స్ జియోలో రూ.199 రీఛార్జ్ చేసుకుంటే రోజూ 1.5 జీబీ డేటా ఇస్తారు. 28 రోజులు జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్, జియో నుంచి నాన్ జియోకు 1000 నిమిషాల కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్ కూడా ఉంటాయి.

ఎయిర్‌టెల్‌లో రూ.249 రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు రోజూ 1.5 జీబీ డేటా రోజూ 100 ఎస్ఎంఎస్‌లు… అన్‌లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. రూ.279 రీఛార్జ్ చేసుకుంటే హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్స్యూరెన్స్ నుంచి రూ.4 లక్షల బీమా కూడా ఇస్తారు.

వొడాఫోన్ ఐడియా; రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 1.5 జీబీ డేటా రోజు… 28 రోజుల పాటు వస్తుంది. ఇప్పుడు డబుల్ డేటా ఆఫర్ కూడా ఇస్తున్నారు. రోజుకు 3జీబీ డేటా అందిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news