టాలీవుడ్లో కరెక్ట్ సీజన్లో సినిమా రిలీజ్ కావాలంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది సంక్రాంతి సీజన్ .ఆతర్వాత దసరాను మనవాళ్లు లక్కీటైమ్ గా ఫీలవుతారు.ఈ ఏడాది సంక్రాంతికి అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు వచ్చిన బాక్సాఫీస్ ను షేక్ చేసిపారేశాయి.అదే దసరాకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా పల్టీ కొట్టేసింది.
ఈ దసరాకు ఒక్క ప్రెస్టీజియస్ ఫిలిం అయినా రిలీజై సినీ ప్రేక్షకులకు మాంచి ట్రీట్ ఏమైనా దొరుకుతుందేమో అనుకున్నారంత. కట్ చేస్తే అలాంటి బొమ్మ ఇప్పట్లో పడదని తెలిసిపోయింది.దసరా ఆల్మోస్ట్ మిస్ అయిపోయింది..మరి దీపావళికి ఏమైనా థియేటర్లో మజా చేసుకునే ఛాన్స్ ఇస్తారో లేదో ఫిల్మీ మేకర్స్ అప్పుడే చెప్పలేమంటున్నారు. పెద్ద సినిమాలే కాదు చిన్న బొమ్మలు కూడా సరైన ఆక్యుపెన్సీ లేకుండా థియేటర్లో విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
కరోనా భయం, థియేటర్లలో షరతులతో ప్రేక్షకులు ఏమేర సినిమాలు చూసేందుకు వస్తారో అన్నది సందేహంగా మారింది. పైగా అసలే 50 శాతం ఆక్యుపెన్సీ, అందులో ఎన్ని సీట్లు నిండుతాయో తెలియదు. కాబట్టి రెవెన్యూ మీద పెద్దగా ఆశల్లేవు. ఈ నేపథ్యంలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను దసరాకు రిలీజ్ చేయలేని పరిస్థితి. దీంతో దసరా సీజన్ విషయంలో ఫిల్మీ లవర్స్ పెద్దగా ఆశలు పెట్టుకోక పోవడం బెటర్.