పండుగ పూట విషాదం… ఏపీలో పదకొండు మంది మృతి !

Join Our Community
follow manalokam on social media

ఈరోజు రేపు హోలీ పండుగ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే పండుగ పూట కూడా ఏపీలో రహదారులు రక్తమోడాయి. నెల్లూరు జిల్లాలో ఈ ఉదయం ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  కర్నూలు జిల్లాలోని శ్రీశైలం నుంచి నెల్లూరు జిల్లాకు వస్తుండగా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద ఆగివున్న లారీని ఒక టెంపో ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో టెంపో లో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  మరొకరు ఆస్పత్రికి తరలించే సమయంలో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.  మృతులంతా తమిళనాడుకు చెందిన వారీగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరో పక్క కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలంలో తెల్లవారుజామున  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ ను ఆటోను ఢీకొట్టిన క్రమంలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...