జైలులో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలకు బెయిల్ మంజూరు…

-

ఉస్మానియా యూనివర్సిటీ లో రాహుల్ గాంధీ పర్యటన కు అనుమతి ఇవ్వాలంటూ కొద్ది రోజుల క్రితం ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి నేతలు ఆందోళన చేపట్టారు. వీరిని అరెస్టు చేసిన పోలీసులు మహిళా కానిస్టేబుల్ పై అసభ్యంగా ప్రవర్తించారంటూ నాన్బెయిలబుల్ కేసులు పెట్టి చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యటనకు వచ్చే రాహుల్ గాంధీ వారితో ములాకత్ అయ్యేందుకు పార్టీ నేతలు జైలు సూపర్డెంట్ కోరగా జైలు అధికారులు అనుమతి ఇచ్చారు.

దీంతో రాహుల్ గాంధీతో పాటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జైలుకెళ్లి ఎన్ ఎస్ యు ఐ నేతలతో ములాకత్ అయ్యారు. అయితే తాజాగా జైలులో ఉన్న 18 మంది ఎన్ఎస్ యూయ్ ఐ నాయకులకు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. బల్మూరి వెంకట్ తో సహా 18 మంది నాయకులకు బెయిల్ మంజూరైంది.

Read more RELATED
Recommended to you

Latest news