ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఉండగా.. ఓ యువకుడు రాయితో దాడి చేసిన ఘటన అందరికీ తెలిసిందే. ఆ ఘటనలో సీఎం జగన్ కి గాయం అయింది. గాయంతో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు సీఎం జగన్. అయితే సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు.
గత నెల 28వ తేదీన బెయిల్ మంజూరు చేసింది విజయవాడ కోర్టు. గత నెల 30వ తేదీన ఒకరోజు బెయిల్ పై స్టే ఇచ్చింది విజయవాడ కోర్ట్. అయితే బెయిల్ పై స్టే ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు పోలీసులు. వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. రూ.50,000 చొప్పున రెండు షూరిటీలతో లక్ష రూపాయల పూచి కత్తు విజయవాడ కోర్టుకు సమర్పించిన సతీశ్ తరఫున న్యాయవాది. పూచికత్తు ను యాక్సెప్ట్ చేయొద్దని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. పూచి కత్తుతో బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో వాదన వినిపించిన సతీష్ తరపు న్యాయవాది సలీం. ఇరువురి ముగిసిన వాదనలు ముగిసాయి. అయితే కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు ఇరు వర్గాలు.