క్రికెట్‌లో అప్పుడప్పుడు వింతైన సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. బ్యాట్స్ మెన్ చిత్రమైన రీతిలో ఔట్ అవుతుంటారు. అయితే వికెట్ల మీద ఉండే బెయిల్స్ వాటంతట అవే పడిపోయిన సంఘటనలు చూశారా ? లేదు కదా.. దాదాపుగా అలా జరగదు. కానీ బంగ్లాదేశ్, జింబాబ్వే జట్ల మధ్య జరిగిన తాజా టీ20 మ్యాచ్‌లో అలాగే జరిగింది. దీంతో దెయ్యం వికెట్ తీసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
బంగ్లాదేశ్ జట్టు జింబాబ్వే పర్యటనలో భాగంగా ఇటీవల రెండో టీ20 మ్యాచ్ ఆడింది. అయితే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో 18వ ఓవర్ లో ఆ జట్టుకు చెందిన మహమ్మద్ సైఫుద్దీన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతని వెనుక వికెట్ల మీద ఉన్న బెయిల్స్ వాటంతట అవే పడిపోయాయి. బ్యాట్స్‌మన్ లేదా బాల్ తగల్లేదు. అయినా బెయిల్స్ పోడిపోయాయి.
First ever wicket taken by a ghost 😛😂 pic.twitter.com/9vG0BI50S4
— Mazher Arshad (@MazherArshad) July 24, 2021
కాగా ఆ దృశ్యాలు కెమెరాలోనూ స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో బెయిల్స్ ఎందుకు పడిపోయాయో అర్థం కాలేదు. మొదట బ్యాట్స్ మెన్ వికెట్లను తాకాడేమోనని అనుకున్నారు. హిట్ వికెట్ అయిందని భావించారు. కానీ అలా జరగలేదు. బెయిల్స్ వాటంతట అవే పడిపోయాయి. దీంతో వికెట్ పోలేదని నిర్దారించారు. అయితే గాలి వల్ల బెయిల్స్ పడిపోయి ఉంటాయని నిర్దారణకు వచ్చారు.
కానీ నెటిజన్లు మాత్రం ఆ వీడియోను చూసి రక రకాల కామెంట్లు చేస్తున్నారు. దెయ్యం వికెట్ తీసిందని, క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా దెయ్యం తీసిన వికెట్ ఇదేనని కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.