రేవంత్‌ రెడ్డి బాటలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి?

-

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ( JaggaReddy ) టీపీసీసీ చీఫ్ పదవిని ఆశించిన సంగతి అందరికీ తెలిసిందే. తనకు పీసీసీ ఇస్తే కాంగ్రెస్‌ను తెలంగాణలో నిలబెట్టే ప్రయత్నం చేస్తానని అప్పట్లో పలు వ్యాఖ్యానాలు చేశారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా ప్రకటించింది. ఆ నియమాకంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత మేరకు ఉత్సాహం, ఉత్తేజం వచ్చిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

 

jaggareddy | జగ్గారెడ్డి
jaggareddy | జగ్గారెడ్డి

కాగా, రేవంత్‌ రెడ్డి నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్ నేతల్లో జగ్గారెడ్డి ఒకరు. అయితే, జగ్గారెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ గూటిలోనే ఉన్నారు. మధ్యలో ఒకసారి బీజేపీలోకి వెళ్లినప్పటికీ కొద్దిరోజులకే మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. రేవంత్‌ను చీఫ్‌గా ఎంపిక విషయమై ఏకంగా ఏఐసీసీ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి జగ్గారెడ్డి లేఖలు రాశారు. అయితే, కాంగ్రెస్ కొత్త కమిటీలో జగ్గారెడ్డికి స్థానం ఇవ్వడం గమనార్హం. కాగా, జగ్గారెడ్డి ఇటీవల కాలంలో రేవంత్ బాటలోనే పయనిస్తున్నారనే చెప్పొచ్చు. రేవంత్ మాదిరిగానే జగ్గారెడ్డి టీఆర్ఎస్ సర్కారుపై ఆరోపణలు చేస్తున్నారు.

కొండాపూర్‌లో గతంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల భూములను ప్రభుత్వం కబ్జా చేసే ఆలోచన చేస్తోందని, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ మేరకు కుట్రలు పన్నుతున్నారని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో భూకబ్జాల విషయమై రేవంత్ రెడ్డి కూడా పలు ఆరోపణలు చేశారు. కాగా రేవంత్ మాదిరిగానే సేమ్ టు సేమ్ జగ్గారెడ్డి ఆరోపణలు చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొండాపూర్ భూముల విషయమై కోర్టకు వెళ్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. దళితులకు కేసీఆర్ చేస్తున్న అన్యాయాలపై నిలదీయాలని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌కు జగ్గారెడ్డి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news