బాలయ్య ‘అఖండ’మూవీ విడుదలపై క్లారిటీ ఇచ్చిన బోయపాటి

తిరుమల: సినీ దర్శకుడు బోయపాటి శ్రీను శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ‘అఖండ’ మూవీపై ఆయన స్పందించారు. ‘అఖండ’ చిత్ర నిర్మాణం ఆఖరి దశలో ఉందని చెప్పారు. ఆఖరి సన్నివేశాల చిత్రీకరణ కోసం లొకేషన్ చూస్తున్నామని తెలిపారు. చిత్తూరు, కడప ప్రాంతాల్లో చిత్రీకరణ ఉంటుందని పేర్కొన్నారు. కరోనాను అంచనా వేసుకుని చిత్రాన్ని విడుదల చేస్తామని బోయపాటి శ్రీను స్పష్టం చేశారు.

కాగా ‘అఖండ’ మూవీ బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా. ఇప్పటికే రెండు సినిమాలు రికార్డులు బద్ధలకొట్టాయి. ఈ కాంబినేషన్‌లో వస్తున్న మూడో మూవీపై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ మూవీలో బాలయ్య ద్విపాత్రాభియం చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతుగా, అఘోరాగా బాలయ్యను బోయపాటి చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ చాలా వరకూ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కరోనా వల్ల షూటింగ్ నిలిచిపోయింది. కరోనా వేవ్ తగ్గడంతో మళ్లీ షూటింగ్ కొనసాగుతోంది. ప్రజ్ఞ జైస్వల్‌తో పాటు పూర్ణ ఈ చిత్రంలో నటిస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్‌గా నటించనున్నట్లు సమాచారం.