గద్దర్ ఓ విప్లవశక్తి.. గద్దర్ మృతి బాధాకరం : బాలకృష్ణ

-

ప్రజా ఉద్యమనాయకుడు గద్దర్ మృతిపట్ల సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ అని బాలకృష్ణ కొనియాడారు. గద్దర్ మృతిపట్ల విచారణ వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు.‘గద్దర్ ఓ విప్లవశక్తి. ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా మన గద్దర్ గుర్తుకు వస్తారు. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరు తీర్చలేరు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని నందమూరి బాలకృష్ణ ప్రకటనలో వెల్లడించారు.

Incorrigible Telugu actor Nandamuri Balakrishna suffers from 'foot in  mouth' complex

ఇదిలా ఉంటే.. గద్దర్‌ మరణ వార్త తెలియగానే శాస‌న‌స‌భ‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కే తారక రామారావు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శాసనసభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రజా గాయకుడు, అందరికి ఆప్తుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ మరణానికి శాసనసభ, రాష్ట్ర ప్రభుత్వం నివాళుల‌ర్పిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ పాటకు ప్రపంచ వ్యాప్త కీర్తి తెచ్చిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్‌గా ప్రసిద్ద పొందిన గుమ్మడి విఠల్‌ మరణించడం యావత్‌ తెలంగాణ ప్రజలకు దిగ్బ్రాంతి, దుఃఖాన్ని కలిగించిందన్నారు. `ప్రజా యుద్ధ నౌకగా పేరొందిన ఆయన విప్లవోద్యమాల్లో కీలక పాత్ర పోషించి, ఎన్నో పాటలతో ప్రజా ఉద్యమాలను తీర్చిదిద్దిన కళాకారులు గద్దర్‌. ఆయన లేని లోటు తీర్చలేనిది, పూడ్చలేనిది` అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో సందర్భాల్లో కలిసి వేదికలు పంచుకున్నామని గుర్తు చేసుకున్నారు. తమలో గద్దర్‌ ఉత్సాహాన్ని నింపారని, ఆయన అద్భుతమైన కళాకారుడని, ఆయన మన మధ్య‌ లేకపోవడం బాధాకరమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news