దిగివచ్చిన ఉక్రెయిన్…. రష్యాతో ఒప్పందాన్ని సిద్ధం అంటున్న జెలన్ స్కీ

-

ఉక్రెయిన్ పై  రష్యా విరుచుకుపడుతోంది. యుద్ధం ప్రారంభమై దాదాపుగా నెలరోజులు కావస్తున్నా… దాడులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు ఖార్కివ్, మరియోపోల్, ఎల్వీవ్ నగరాలపై వరుసగా దాడులు చేస్తోంది. క్షిపణులు, హైపర్ సోనిక్ క్షిపణులతో దాడులు చేస్తోంది. రష్యా, ఉక్రెయిన్ ఇప్పటికే బెలారస్ వేదికగా నాలుగు సార్లు చర్చలు జరిగినా… పెద్దగా ప్రయోజనం కనిపించ లేదు. ఇరు దేశాలు కూడా తమ డిమాండ్లపై నుంచి వెనక్కి తగ్గలేదు. 

ఇదిలా ఉంటే ఉక్రెయిన్ కాస్త దిగివచ్చినట్టే కనిపిస్తోంది. రష్యాతో ఒప్పందంపై చర్చించేందుకు సిద్దంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ప్రకటించారు. రష్యా యుద్ధం విరమిస్తే తాము నాటోలో చేరే ప్రయత్నాలను కూడా విరమించుకుంటామని జెలన్ స్కీ అన్నారు. తాజాగా ఉక్రెయిన్ టీవీ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే రష్యా అధ్యక్షుడితో నేరుగా చర్చలు జరపాలనే డిమాండ్ ను జెలన్ స్కీ ప్రస్తావించాడు. ఇలా అయితే రష్యా యుద్ధం అపుతుందో లేదో అని తెలుస్తుందంటూ వ్యాఖ్యానించాడు.

Read more RELATED
Recommended to you

Latest news