చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించనున్న “ఐ డోంట్ కేర్”: బాలకృష్ణ

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రేమండ్ లో ఉన్నారు. కేసు కోర్ట్ లలో విచారణలో ఉన్నాయి.. ఇప్పటికీ ఇంకా అసలు తప్పు జరిగిందా ? జరిగితే ఎవరు చేశారు ? అందుకో చంద్రబాబు ప్రమేయం ఉందా అన్నది తెలియాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. కాగా చంద్రబాబు అరెస్ట్ పై తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులు మరియు సినీ రంగానికి చెందిన నేతలు కూడా స్పందించారు.. కానీ ఇప్పటి వరకు అధికారికంగా బహిరంగంగా సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించినట్లు ఎక్కడా లేదు. ఈ విషయంపై తాజాగా హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలయ్యి మీడియా వేదికగా స్పందించారు. ఈయన మాట్లాడుతూ… చంద్రబాబు అరెస్ట్ పై ఇప్పటి వరకు స్పందించని సినిమా నటీనటుల గురించి నేను పట్టించుకోను, ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అంటూ బాలకృష్ణ అనడం చాలా సందేహాలకు దారి తీస్తోంది.

మరి ఈ కామెంట్స్ పై ఎన్టీఆర్ ఏమైనా స్పందిస్తారా ? లేదా ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు కుటుంబ సభ్యులతో ఏదైనా పద్దతిలో మాట్లాడారా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news