WORLD CUP 2023: ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్… బెన్ స్టోక్స్ దూరం అయ్యే ఛాన్స్ ?

-

ఎప్పుడెప్పుడా అని ప్రపంచంలోని కోట్లాదిమంది క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్న క్షణం మరికొన్ని గంటల్లోనే రానుంది. ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రేపు మధ్యాహ్నం నుండి వన్ డే ప్రపంచ కప్ 2023 స్టార్ట్ కానుంది. మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ లు పోటీ పడనున్నారు. గత వరల్డ్ కప్ ఫైనల్ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో ఇప్పటికీ మనకళ్లకు కనబడుతూనే ఉంటుంది అని చెప్పాలి. రేపు కూడా అదే స్థాయిలో ఎంటర్టైన్ మెంట్ ఉంటుందని తెలుస్తోంది. కాగా మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ జట్టుకు గట్టి షాక్ తగిలేలా ఉంది.. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ హిప్ దగ్గర పెయిన్ ఉండడం వలన మ్యాచ్ ఆడుతాడా లేదా అన్నది సందేహంగా ఉంది. ఈ విషయంపై కెప్టెన్ బట్లర్ మాట్లాడుతూ రేపు మ్యాచ్ జరిగే సమయానికి స్టోక్స్ ఫిట్ గా లేకపోతే అతనికి మొదటి మ్యాచ్ కు విశ్రాంతిని కలిపిస్తామంటూ చెప్పారు.

స్టోక్స్ స్థానంలో యువ ఆటగాడు హరీ బ్రూక్ ను జట్టులోకి తీసుకుంటామని కూడా క్లారిటీ ఇచ్చాడు బట్లర్. మరి ఏమి జరగనుంది ? నిజంగానే స్టోక్స్ రేపు మ్యాచ్ కు దూరం అవుతాడా ?

Read more RELATED
Recommended to you

Latest news