బాలయ్య “అన్ స్టాపబుల్” రెండో గెస్ట్ గా నాని..ప్రోమో ఎప్పుడంటే..?

నటసింహం నందమూరి బాలకృష్ణ “అన్ స్టాపబుల్ ఎన్బీకే” టాక్ షో తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షో ప్రారంభం అవ్వగా మొదటి గెస్ట్ గా మంచు ఫ్యామిలీ నుండి మోహన్ బాబు, విష్ణు, మంచు లక్ష్మి వచ్చారు. ఇక ఫస్ట్ ఎపిసోడ్ లో బాలయ్య అదరగొట్టారు. మొదటి సారి హోస్ట్ గా చేసినప్పటికీ బాలయ్య తన పంచులతో ఆకట్టుకున్నారు. ఇక బాలయ్య ఆహాకు తర్వాత వచ్చే గెస్ట్ ను పరిచయం చేసింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో హీరో నాని వస్తున్నట్టు ఆహా ప్రకటించి ఫోటోలను విడుదల చేసింది.

Balayya unstoppble with nani

అంతేకాకుండా సెకండ్ ఎపిసోడ్ ప్రోమో సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. దాంతో నానిని బాలయ్య ఎలా ఇంటర్వ్యూ చేస్తారు….నాని ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అన్నది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉండగా బాలయ్య ప్రస్తుతం అఖండ అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.