అరటిపండు అన్ని సమయాల్లో అందరికీ ప్రియమైన మరియు చవకగా దొరికే పండు. అందుకే దీనిని పేదవాడి ఆపిల్ గా పిలుచుకుంటారు. ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ. అరటి పండు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి దీనిని మీరు రోజువారీ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాలి. ఒక అరటి పండు తింటే 3 యాపిల్ పండ్లు లేదా ఒకటిన్నర గుడ్లు తిన్నట్లే. అరటికాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తెలిస్తే రోజుకి ఒక్క అరటి పండు అయిన తింటారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు రెండు అరటిపండ్లు తినడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు, తగినంత శక్తిని పొందవచ్చు. ఎనర్జీ వల్ల మీ శరీరంలో బ్లడ్ స్థాయిలు స్థిరంగా కొనసాగటానికి సహాయపడుతాయి. అరటి పువ్వును ఉడికించి పెరుగుతో కలిపి తింటే రుతు సమయంలో కలిగే నొప్పి, రక్తస్రావం తగ్గుతాయి. ఒక్క అరటి పండు తినడం వల్ల వ్యాయమం సమయంలో కండరాల తిమ్మెరలను నివారించడానికి మరియు రాత్రుల్లో కాళ్ళ తిమ్మెరలను నివారించడానికి సహాయపడతాయి.వేవిళ్లతో బాధపడే గర్భిణులకు అరటి పండు తినిపిస్తే తగినంత శక్తితోపాటు ఫోలిక్ యాసిడ్ కూడా అందుతుంది. అరటిపండ్లులో ఉండే ఐరన్ కంటెంట్ వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది.
నీరసంగా ఉన్నవారికి ఒక అరటిపండు ఇస్తే చాలు మునిపటిలా శక్తిని పుంజుకుంటారు. బాగా పండిన అరటిపండులో పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. క్రికెట్ ఆటగాళ్లకు శక్తినివ్విడానికి అరటిపండ్లను ఇస్తారు. ఇవి తొందరగా జీర్ణమై శక్తిని ఇస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పచ్చిగా ఉన్న అరటిపండ్లను వెంటనే తినేయకూడదు. వాటిని రెండు రోజులపాటు కవర్లో ఉంచితే పండుతాయి. పండిన వాటిలో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది.
పసిపిల్లలకు పాలు మాన్పిస్తే అరటిపండును మెత్తగా, గుజ్జులా చేసి ఆహారంగా ఇవ్వాలి. ఇలా తినిపిస్తే అనేక ప్రయోజనాలుంటాయి. ఇది అరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇంకో ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి ఈ పండిన అరటిపళ్ళని షుగరు ఉన్న వ్యక్తులు తినకూడదు ఎందుకంటే ఇవి తియ్యగా ఉంటాయి కావున రక్తంలో గ్లూకోస్ స్థాయి ఎక్కువ అవుతుంది. అందుకనే షుగరు వ్యాధి గ్రస్తులు బాగా పండినది కాకుండా కొంచెం పచ్చిగా ఉన్న అరటిపండు తింటే మంచిది. అరటిపండు తినడం వల్ల ఎన్ని లాభాలో చూసారుగా ఇంకెందుకు ఆలస్యం కనీసం రెండు రోజులకు అయిన ఒక అరటిపండు తినండి. కుదిరితే రోజుకు ఒకటి తింటే మరి మంచిది.