ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ‘విజయవాడలో ఖరీదైన కోట్ల రూపాయల దేవుడి స్థలంపై పెద్దల కన్ను పడింది. తమ వారికి పీఠాన్ని కట్టబెట్టేందుకు స్కెచ్ వేశారు. “కీలకమంత్రి” చక్రం తిప్పడంతో చకచకా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
శివయ్య స్థలం స్వాహా కాకుండా కాపాడేందుకు అధికారులు, మీ ప్రజాప్రతినిధులు, మంత్రిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి జగన్ గారు’ అని దేవినేని ప్రశ్నించారు. ఈ ట్వీట్ కి న్యూస్ పేపర్ లో వచ్చిన కొన్ని కథనాలను జాతచేశారు. కాగా, ఈ మధ్య వైసీపీ ప్రభుత్వం పై ఒంటికాలు మీద లేస్తున్న దేవినేని ఉమా తీరు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది.
ఖరీదైన కోట్లరూపాయల దేవుడిస్థలంపై విజయవాడలో పెద్దలకన్నుపడింది.తమవారి పీఠానికి కట్టబెట్టేందుకు స్కెచ్ వేశారు "కీలకమంత్రి"చక్రంతిప్పడంతో చకచకా ఉత్తర్వులు జారీఅయ్యాయి.శివయ్యస్థలం స్వాహాకాకుండా కాపాడేందుకు అధికారులు,మీప్రజాప్రతినిధులు,మంత్రిపై ఏంచర్యలు తీసుకున్నారోచెప్పండి@ysjaganగారు pic.twitter.com/MtqvcB1b8R
— Devineni Uma (@DevineniUma) July 10, 2020