టీడీపీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణ అరెస్ట్‌

-

టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో ఆయనకు 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చిన అనంతరం గుంటూరు పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు బండారు సత్యనారాయణను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి రోజాపై బండారు అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ నేతలు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Bandaru Satyanarayana's Derogatory Language On Minister Roja! | Bandaru  Satyanarayana Derogatory Language On Minister Roja

దీంతో అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న బండారు సత్యనారాయణకు వైద్య పరీక్షలు చేయించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఆయన ఇంటికి తీసుకొచ్చిన ప్రైవేట్ అంబులెన్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లోపలకు పంపేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. మాజీ మంత్రి బండారు సత్యారాయణను అరెస్ట్ చేసిన పోలీసులు…ఆయనను గుంటూరు తరలిస్తున్నారు. బండారు సత్యారాయణపై రెండు కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రి రోజాను దూషించారని కేసులు నమోదు చేశారు. అయితే బండారు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news