కాంగ్రెస్‌లో బీసీ ఆశావాహుల కోసం పీసీసీగా తాను కొట్లాడుతా : రేవంత్‌ రెడ్డి

-

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో ఆయా పార్టీల నేతలు బరిలోకి దిచే అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్‌ రెడ్డి ఇవాళ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో బీసీ ఆశావాహుల కోసం పీసీసీగా తాను కొట్లాడుతానని అన్నారు. సర్వేలో ఓసీల కంటే బీసీలకు రెండు శాతం తక్కువగా ఉన్నా.. బీసీలకే టిక్కెట్ ఇస్తామని బీసీ టికెట్లపై కీలక కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని బీసీలు అడగడంలో తప్పులేదని, బీఆర్ఎస్ బీసీలకు ఇచ్చిన సీట్ల కంటే తాము ఎక్కువ ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.

Revanth Reddy: విధులకు హాజరుకాని రేవంత్‌రెడ్డి భద్రతా సిబ్బంది | revanth  reddy is a security personnel who is absent from duty

టిక్కెట్‌ల ప్రకటన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ తర్వాతే ఉంటుందని స్పష్టంచేశారు. టిక్కెట్‌ల ప్రకటన నాటి‌కి చాలా మంది బీజేపీ, బీఆర్ఎస్ నేతల చేరిక ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ పార్టీలోకి వస్తున్నారంటేనే కాంగ్రెస్ బలం ఏంటో అర్థం అవుతుందన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్‌కు 25 సీట్లు దాటే చాన్స్ లేదన్నారు. రాష్ట్రంలో 19% ఓట్లు అన్ డిసైడ్‌లో ఉన్నాయని, ఇందులో మెజారిటీ ఓటు షేర్ కాంగ్రెస్‌కే వస్తుందని ధీమ వ్యక్తంచేశారు. కాంగ్రెస్ వేవ్‌ను ఆపడం ఎవరి తరం కాదని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని రేవంత్ రెడ్డి తెలిపారు. భయంతో ఉచిత సిలిండర్లు, సన్న బియ్యం రేషన్, రైతులకు పెన్షన్ లాంటి హామీలు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్ పనైపోయిందని, ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరన్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news