టీఆరెస్ పార్టీకి ఖలిస్థాన్ సంస్థకు సంబంధాలు : బండి సంజయ్

-

టీఆరెస్ పార్టీకి ఖలిస్థాన్ సంస్థకు సంబంధాలు ఉన్నాయంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ని అడ్డుకుంది రైతులు అన్నారు ,మేమె అడ్డుకున్నామని ఖలిస్తాన్ ప్రకటించిందని… గుర్తు చేశారు. నిజామాబాద్ లోనూ రైతులు దాడి చేసారని టీఆరెస్ చెబుతోందని.. కానీ తెలంగాణ రైతులు ఎవరు కర్రలు, కత్తులతో దాడులు చేయరని నిప్పులు చెరిగారు.

మరి టీఆరెస్ కూడా ఖలిస్థాన్ లాంటి సంస్థను వెనక పెట్టుకుందా చెప్పాలి…మాకు కూడా అనుమానం ఉందని ఆరోపించారు. పార్లమెంట్ సభ్యుడు అరవింద్‌ తన నియోజకవర్గంలో పర్యటిస్తే దాడులు చేస్తారా….దాడులు చేసే సంస్కృతికి బిజెపి కి వ్యతిరేకమని నిప్పులు చెరిగారు.

దాడులకు బిజెపి కార్యకర్తలు భయపడరని.. రుణ మాఫీ ,డబుల్ బెడ్ రూమ్,పెన్షన్ లాంటి పనులు సరిగా ఇవ్వని టీఆరెస్ నాయకుల పై ఇలానే దాడులు చేయమంటారా అని నిలదీశారు. సిద్దాంతం కోసం త్యాగాలు చేయడానికైనా కాషాయ కార్యకర్తలు వెనకాడరని స్పష్టం చేశారు. నంబర్ వన్ తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని…దాడులు చేసేందుకా తెలంగాణ తెచ్చుకున్నదని అని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news