ప్రధాని మోడీ లేకపోయింటే…రామ మందిర నిర్మాణం జరిగేదా ? : బండి సంజయ్

-

ప్రధాని మోడీ లేకపోయింటే… అయోధ్య లో దివ్యమైన, భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగేదా ? 370 ఆర్టికల్ రద్దు జరిగేదా ? అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఇవాళ హైదరాబాద్‌లని నల్లకుంట శంకర మఠంలో జరిగిన పూజా కార్యక్రమంంలో బండి సంజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో అనేక దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని… చాలా దేవాలయాలు ఇప్పటికీ దూప, దీప నైవేద్యాలకు నోచుకోకపోవడం బాధాకరమన్నారు.

కేదారనాథ్ లోని ఆది శంకరాచార్యుల సమాధి వరద బీభత్సంలో దెబ్బతిన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ధ్రుఢ సంకల్పంతో పున: ప్రతిష్టించడం గొప్ప విషయమని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం లేకుంటే ఇలాంటి పవిత్ర కార్యం జరిగేదా ? అని ప్రశ్నించారు. దీన్ని కూడా మతతత్వ కోణంలో చూస్తే ఇంత కంటే మూర్ఖత్వం ఇంకోటి లేదన్నారు. 80 శాతం హిందువులున్న దేశంలో ధర్మ కార్యం చేయడం మతతత్వమవుతుందా? అని ఫైర్‌ అయ్యారు. కుహానా లౌకిక శక్తుల ఆలోచనల నుండి బయటకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news