కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో మోనిత ప్రియమణితో మనం ఆడించినట్లుగా కార్తీక్ అండ్ ఫ్యామిలీ ఆడుతారు అంటుంది. అతి త్వరలో నాకు మా అత్తగారు…కుడికాలు పెట్టి హారతి ఇచ్చి మరీ ఆహ్వానిస్తారు చూడూ అంటుంది. ప్రియమణి ఇది అయ్యే పనేనా అమ్మా అంటుంది. అవుతుంది ప్రియమణి..ఈలోపు నేను ఆరోగ్యకరమైన ఆహారం తింటూ మరింత అందంగా అయ్యేలా చూసుకోవాలి, ఏ క్షణంలో అయినా మా అత్తయ్యగారి దగ్గరనుంచి పిలుపురావాలి అనొచ్చు అంటుంది. ఇంతలో భారతి వస్తుంది. భారతి సౌందర్య దోషనివారణ పూజకు రమ్మన్నది చెప్తుంది. ఆ మాట విన్న మోనిత ఓవర్ యాక్షన్ చేస్తుంది..వినిపించికూడా వినపడనట్లు యాక్ట్ చేస్తుంది. భారతీకి కాల్తుంది. సౌందర్యగారు నాకు ఫోన్ చేసి రమ్మన్నారు వెళ్లాను అంటుంది. మోనిత కాఫీ ఇచ్చారా, టీ ఇచ్చారా అంటుంది. మోనిత దిస్ ఈస్ టూ మచ్చ్..పాపం తన కొడుక్కి ప్రాణం గండం ఉందని టెన్షన్ పడుతున్నారు. ఒక మెట్టు దిగారని బెట్టు చేస్తున్నావా అంటే..అంతగా మెట్టు దిగితే.. నా ఇంటికే రావాలికదా భారతి అని మోనిత అంటుంది. ఈ భారతి ఇలా చేయటం కరెక్టుకాదు అని పోయి పోయి ఆ మోనితకే నీతులు చెప్తుంది. మోనిత వినేరకం కాదుగా..నాకు ప్రవచానాలు చెప్పాలని చూడకు..వాళ్లు నన్ను ఎంతలా బాధపెట్టారో తెలుసుకదా అంటూ గతంలో కార్తీక్ ఫ్యామిలీ మోనిత పట్ల ప్రవర్తించిన తీరును భారతీకి చెప్తుంది. అయితే ఏంటి ఇప్పుడు వెళ్లనంటావా అంటుంది భారతి. బాగా పొద్దుపోయింది భారతి వెళ్లు, నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు అంటుంది.
ఇటుపక్క సౌందర్య కార్తీక్ ను బయటకు తీసుకొచ్చి మెట్లమీద పంచాయతీ పెడుతుంది. నేను ఏం చెప్తున్నానో అర్థంచేసుకోరా అంటుంది. మమ్మీ నా మనసు నువ్వు కూడా అర్థంచేసుకో, నేను పూజకోసం వస్తాను, అది కూడా నీకోసం, కానీ ఆ మోనిత పక్కన మాత్రం కూర్చోను అంటాడు. ప్రాణగండం ఉందని పంతులుగారు చెప్పారు, మంచోచెడు వెళ్దాం రా అంటాడు. కార్తీక్ ఒప్పుకోడు. సౌందర్య పొద్దున కాస్త అయితే ఏం జరిగి ఉండేది నువ్వు చూశావ్ కదా, వైరుతెగిపడి ఆ కరెంట్ షాక్ నీకు తగిల్తే పిల్లలు ఏమైపోతారు, దీప బతుకు ఏమవుతుంది అంటుంది. అవన్నీ నమ్మాలి అని రూలేం లేదు కదా అంటాడు కార్తీక్. అయినా సౌందర్య ఏదో ఒకటి కార్తీక్ ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అసలు ఇదంతా ఎందుకు వచ్చిందంటావ్..నువ్వు చేసిన తప్పువల్లే కదా అంటుంది. నాకు ఇప్పటికీ అది ఎలా చేయాలో అర్థంకావటంలేదు, నేను తాగాను అంతే అంటాడు. చర్చ తప్పు జరిగిందానిమీద కాదు, చేయాల్సిన పూజమీద అంటాడు. కార్తీక్ పూజగదికి తీసుకెళ్లి..ప్రమాణం మీద చేసి మరీ చెప్తున్నాను. స్పృహలో ఉండి నేను ఏ తప్పు చేయలేదు అంటాడు. రేయ్..తప్పు జరిగిందానిగురించి కాదురా..రేపు నువ్వు పూజచేస్తేనే నాకు మనఃశాంతిగా ఉంటుందిరా అంటుంది సౌందర్య. ఇంతలో వెనక నుంచి దీప..శాంతి ఏంటి అత్తయ్య అంటుంది. అంతే తల్లీకొడుకులకు నోటమాటరాదు. దీప దగ్గరకు వచ్చి ఏంటి అత్తయ్య ఏం మాట్లాడరు. ఇందాకేదో మనఃశాంతి, శాంతి అంటున్నారు, ఈ టైంలో పూజగది ముందు ఏం మాట్లాడుకుంటున్నారు అంటుంది. సౌందర్య పూజగది రేపు శుభ్రం చేస్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అంటున్నాను. దీప రాత్రి పదకొండుగంటలు దాటిన తర్వాత పూజగది శుభ్రచేయాలనే ఆలోచన రావటం మంచివిషయం అత్తయ్య అంటుంది. రేపు మంచిరోజని అంటుంది సౌందర్య..పర్లేదు అత్తయ్య టైం బాగుంటే అన్నీ మంచిరోజులే..టైం బాగోకపోతే అన్నీ చెడ్డరోజులే నాలాగా అని వెళ్తూ దీప..అత్తయ్య పూజగదిని శుభ్రం చేయటం కూడా మీరు ఇద్దరే చేస్తారా, లేక నాకేమైనా అవకాశం ఇస్తారా అంటే..మీరు గుడికి వెళ్తేనే నన్ను తీసుకువెళ్లలేదు, నాకు చెప్పలేదుకదా అందుకే అడిగాను అని దీప వెళ్లిపోతుంది.
ప్రియమణి దొంగచాటుగాఇంటికి వస్తుంది. మంచిదైంది ఎవరూ ఫోన్ చేసి అడగలేదు ఇంకా అనుకోని లోపలికి వెళ్తుంది. దీప చూస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నావ్ అని అడుగుతుంది. బయటపనుంటే వెళ్లాను అంటుంది ప్రియమణి. బయటపనుంటే వెళ్లినదానివి దర్జాగా ముందుతలుపు తీసుకునే రావాలిగా..దొంగచాటుగా ఎందుకు వస్తున్నావ్ అంటుంది. ప్రియమణి నసుగుతుంది. ఎవరు లేరన్నావ్, తిండికి ఇబ్బంది అవుతుందంటేనే నిన్ను తీసుకొచ్చాను, నిజం చెప్పు అంటుంది. ప్రియమణి చెప్పాను కదమ్మా బయటకువెళ్లాను అని అంటుంది. అదే బయటకు వెళ్లి ఎవరిని కలిసి వస్తున్నావ్..చెప్తావా, అత్తయ్యను పిలవాలా అంటుంది. ప్రియమణి మనుసులో ఏటూ అక్కడికి వెళ్లిపోయేదాన్నే భయం భయంగా ఇక్కడ పనిచేసేబదులు నిజం చెప్తే అయిపోతుంది అనుకుని మోనితమ్మ దగ్గరకు వెళ్లాను దీపమ్మా అంటుంది. దీపకు దిమ్మతిరిగిపోతుంది.
ఏంటి మోనితతో ఇంకా నువ్వు మాట్లాడుతున్నావా అంటే..హు అంటుంది. అసలు మోనితమ్మ నన్ను వదిలిపెట్టదమ్మా, జైల్లో ఉన్నప్పుడు కూడా వెళ్లికలిశాను తెలుసా అంటుంది. అంటే ఈ ఇంట్లో పనిచేయమని మోనిత చెప్తే వచ్చావా, ఇక్కడి మాటలన్నీ అక్కడ చేరవేస్తున్నావా, అందరూ నన్ను మోసం చేస్తున్నారు అంటే వాళ్లలో నువ్వు కూడా ఉన్నావా, నడువ్ బయటకి నడువ్, ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్లిపో అంటుంది. తప్పేంది అమ్మా అంటుంది ప్రియమణి. నోర్ మూయ్..వెళ్లిపో..నాకు కోపం రాకముందే వెళ్లిపో..లేకుంటే డాక్టర్ బాబుని పిలుస్తాను, డాక్టర్ బాబుకి పిల్లలకి నిన్ను తీసుకురావటమే ఇష్టం లేదు అంటుంది. ప్రియమణి సిగ్గులేకుండా దర్జాగా వెళ్లిపోతుంది.
రూంలో సౌందర్య ఆలోచిస్తూ ఉండగా భారతీ ఫోన్ చేస్తుంది. మోనిత ఏం చెప్పిందో భారతి చెప్తుంది. సౌందర్య షాక్ అవుతుంది. ఇంకోపక్క కార్తీక్ ను హిమ రూంలోకి తీసుకొచ్చి డాడీ నువ్వు నాకొక ప్రామిస్ చేయాలి అంటుంది. కార్తీక్ కు ఏం అర్థంకాదు. హిమ నువ్వు ప్రామిస్ చేస్తేనే చెప్తాను అంటుంది. సరే చెప్పు అంటే..ఈరోజు నువ్వు ఇక్కడే పడుకోవాలి, కబుర్లు చెప్పుకుందాం అంటుంది. సరదాగా మాట్లాడుకుని చాలారోజులైంది కదా అంటుంది హిమ. కార్తీక్ మనసులో సరదాగా మన ఇంట్లోంచి సరదాగా వెళ్లిపోయింది అనుకుంటాడు. సరేనా డాడీ, శౌర్యకూడా వస్తుంది అందరం ఈరోజు ఇక్కడే ఉందాం అంటుంది. కార్తీక్ సరే అంటాడు. నేను శౌర్యకు ఇదే చెప్పాను..అమ్మను ఒప్పించటానికి శౌర్య వెళ్లింది అంటుంది. కార్తీక్ దీప వస్తుందా సరేలేరా నేను వెళ్తాను అంటాడు.కానీ హిమ వినదు, ఉందాం అంటుంది. కార్తీక్ మీ అమ్మ నన్ను ఇక్కడ చూస్తే ఉండదేమోరా అంటాడు. మళ్లీ గొడవపడ్డారా అంటుంది హిమ. లేదు అంటాడు కార్తీక్. హిమ ఏదో నాలుగు సెంటీ డైలాగ్స్ చెప్తుంది. నువ్వు అమ్మ సరిగా మాట్లాడుకోరు. అడగాలనుంటుంది, అడిగితే మళ్లీ బాధపడతారేమో అనిపిస్తుంది అంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.