కెసిఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని.. ఈ విషయములో కేంద్రం సిరియస్ గా ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కెసిఆర్ పై కేంద్ర ప్రభుత్వం చర్యల కు సిద్దమైంది..ఎప్పుడైనా కెసిఆర్ జైలుకు వెళ్ళొచ్చు…. ఈ విషయం కెసిఆర్ కు తెల్సి పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. అందుకే కమ్యూనిస్టులతో, ఇతర పార్టీల నేతల తో భేటీ అవుతున్నాడని పేర్కొన్నారు.
తేజస్వి యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా పసుగ్రాసం కుంభకోణం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు.. కెసిఆర్ కూడా జైలుకు వెళ్తే ఎలా వుంటుందో.. తేజశ్వి యాదవ్ నిన్న ప్రగతి భవన్ కు వచ్చి వివరించి ఉంటాడని ఎద్దేవా చేశారు. కేంద్రం జైలుకు పంపుతుందనే కమ్యూనిస్టులు, విపక్ష నేతలు కెసిఆర్ ను పరామర్శించేందుకు వస్తున్నారని చురకలు అంటించారు. కేంద్ర ప్రభుత్వం జైలుకు పంపుతే సానుభూతి కోసం కూడా కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నాడని…ఫ్రంట్ లేదు.. టెంట్ లేదంటూ ఎద్దేవా చేశారు. దోచుకోవడం, దాచుకోవడమే… కేసీఆర్ పని అని విమర్శించారు. కెసిఆర్ ఎక్కడున్నా గుంజుకొచ్చుడే…జైల్లో వేసుడే అని వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్..