తాళం వేసి ఉన్న ఇంట్లో మంటలు చెలరేగిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వెంకటేశ్వరనగర్లోని ఓ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఇంట్లోని రూ.30వేల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయని యజమాని రాజు తెలిపారు.
‘తాళం వేసిన ఇంట్లో మంటలు’
-