బండి సంజయ్ కి ముక్కుకి, మూతికి తేడా తెలియదు – ఎర్రబెల్లి దయాకర్ రావు

-

కేంద్ర నిధులను పంచాయితీలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్న బిజెపి నేతల విమర్శలపై ఫైర్ అయ్యారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వివరాలు తెలుసుకొని అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. బండి సంజయ్ కి ముక్కుకు, మూతికి తేడా తెలియదని ఎద్దేవా చేశారు.

నిధుల దుర్వినియోగం పై కేంద్ర అధికారుల ముందు తేల్చుకుందామని చెప్పారు. ఒక రూపాయి కూడా కేంద్ర నిధులు దారి మళ్లించలేదన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక జనగామ జిల్లా కంటి వెలుగు రెండో దశ సన్నద్ధత కార్యక్రమం పై సమీక్ష నిర్వహించిన తర్వాత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్ 4 స్టార్ రేటింగ్ అవార్డులలో మొదటి మూడు తెలంగాణ రాష్ట్రానికి రావడం పట్ల అభినందనలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news