క్షణాల్లో..ఈ బకెట్‌ వాటర్‌ను హీట్‌ చేసేస్తుంది.. ప్రొడక్ట్‌ పర్‌ఫెక్ట్‌..!!

-

చలికాలంలో అందరూ వేడినీళ్లతో స్నానం చేయాలనే అనుకుంటారు.. కానీ అందరి ఇళ్లలో గీజర్లు ఉండవు.. అంత ఖర్చుపెట్టి కొనలేం అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్లంతా వాటర్‌ హీటర్‌ తెచ్చుకుని వాడతారు.. ఇక ఊర్లల్లో అయితే.. కట్టెల పొయ్యిమీద నీళ్ల బిందె వేసి వేడి చేసుకుంటారు. నిజానికి ఇలా కట్టెల పొయ్యిమీద కాగిన నీళ్లే ఉత్తమం.. ఎలాంటి సమస్యా ఉండదు.. కాకపోతే ఈ వెసులుబాటు అందరి ఇళ్లలో ఉండదు.. అయితే వాటర్‌ హీటర్‌ వల్ల పెద్దతలనొప్పి.. అది పెడితే.. ఆ చుట్టుపక్కలకు చిన్నపిల్లలు, వృద్ధులు వెళ్లకుండా చూసుకోవాలి.. తెలిసితెలియక అందులో వేల్లుపెడితే ప్రాణాలకే ప్రమాదం.. గీజర్‌కు బదులుగా వాటర్‌ను హీట్‌ చేయడానికి ఓ బకెట్‌ ఆన్‌లైన్లో ఉంది. దీని గురించి మీకు తెలిసి ఉండకపోవచ్చు.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ బకెట్‌ అందుబాటులో ఉంది. ఇది ఎలా పనిచేస్తుంది, ధర ఎంతో చూద్దామా..!
ఫ్లిప్‌కార్ట్ ఒక బకెట్‌ను విక్రయిస్తుంది. ఇది గీజర్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. దీని ధర కూడా చాలా తక్కువ.. ఇది విద్యుత్ ఆదా చేయడంలో కూడా సహాయపడుతుంది. దీంతో.. డబ్బు ఆదా చేయవచ్చు. అదే అభిరామి 20 ఎల్ ఇన్‌స్టంట్ వాటర్ గీజర్. ఈ బకెట్‌ ధర రూ.2,499..ఫ్లిప్‌కార్ట్ నుంచి డిస్కౌంట్ ద్వారా రూ.1,599కే కొనుగోలు చేయవచ్చు.
ఈ ఉత్పత్తిపై కస్టమర్లకు కంపెనీ ఒక సంవత్సరం వారంటీ కూడా ఇస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో 10 రోజుల పాటు రీప్లేస్‌మెంట్ ఆఫర్ కూడా ఉంది. ఈ మల్టీపర్పస్ వాటర్ హీటర్ 20 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ గీజర్ లాంటి బకెట్ నిమిషాల్లో నీటిని వేడి చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. ఈ ఉత్పత్తిని స్నానం చేయడానికి.. తాగే నీరు వేడి చేసేందుకు.. వంటగది అవసరాలతో పాటు, అనేక ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.
ఈ గీజర్ లాంటి బకెట్ నిమిషాల్లో నీటిని వేడి చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. ఈ ఉత్పత్తిని స్నానం చేయడానికి.. తాగే నీరు వేడి చేసేందుకు.. వంటగది అవసరాలతో పాటు మరియు అనేక ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. ఇది పోర్టబుల్ ఉత్పత్తి.. ఇంకా షాక్‌ప్రూఫ్ డిజైన్‌తో వస్తుంది. దీన్ని ఎక్కడికైనా సులువుగా తీసుకువెళ్లవచ్చు. దీంతో.. బకెట్‌లో నీరు తీసుకోవడానికి కుళాయి కూడా ఉంది. మీకు అవసరం ఉంటే.. ఓసారి ట్రే చేసి చూడండి. నచ్చకపోతే..రిటర్న్‌ చేసేయండి.!

Read more RELATED
Recommended to you

Latest news