నీకు అధికారం ఇచ్చింది.. ఫామ్ హౌస్ ల ఉండనీకే కాదు : బండి సంజయ్

-

కేంద్రం ప్రభుత్వంపై ఆరోపణలు ఆపి, ముందు రైతుల వడ్లను కొను కేసీఆర్ అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. ఇప్పటికే చాలా మంది రైతులు నష్టానికి వడ్లను అమ్ముకున్నారు. అకాల వర్షాలకు వడ్లు తడిసిపోయినయ్. ఆ వడ్లను మొత్తం నువ్వే కొనాలె.నీకు అధికారం ఇచ్చింది.. ఫామ్ హౌస్ ల ఉండనీకే కాదు.. నష్టపోయిన రైతులను నువ్వే ఆదుకోవాలె అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. . తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన మండిపడ్డారు.

Trs shock to telangana bjp president bandi sanjay during his padayatra in mahbubnagar district ak, Bandi Sanjay: బండి సంజయ్‌కు టీఆర్ఎస్ ఆ విధంగా షాక్ ఇచ్చిందా ?.. ముందస్తు ప్లాన్ ?– News18 Telugu

ప్రజా సంగ్రామ యాత్ర- బుధవారం మధ్యాహ్నం మహబూబ్​నగర్ నియోజకవర్గలోని మన్యంకొండ స్టేజీ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా సంజయ్​ మీడియాతో మాట్లాడుతూ.. . రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించమంటే కేసీఆర్ తగ్గించకుండా కేంద్రంపై ఆడిపోసుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ ఉన్నాయని ఆర్టీసీ ఇచ్చిన లేఖతో స్పష్టమైంది. ఇప్పుడు తెలంగాణ సమాజం కేసీఆర్ చెబుతున్న అబద్ధాల గురించి తెలుసుకుంటున్నది, ప్రజలు మార్పు కోసం ఆలోచిస్తున్నరు”అని అన్నారు బండి సంజయ్. కేసీఆర్ నిరంకుశ పాలనతో తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news