పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం ఎవరైనా లీక్ చేస్తారా..? ముందురోజు పదోతరగతి తెలుగు ప్రశ్నపత్రం ఎవరు లీక్ చేశారు..? పదోతరగతి పత్రాల లీక్ ఘటనను కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపే దమ్ముందా..?’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.
‘మీరిచ్చిన హామీలపై ప్రశ్నిస్తే చాలు.. మాకు పిచ్చి అంటారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారంతా పిచ్చివాళ్లని ప్రచారం చేస్తున్నారు. తాగు, తాగించు అనేదే బీఆర్ఎస్ ప్రభుత్వ విధానం. కేసీఆర్ కుమారుడు, కుమార్తె జైలుకు పోవడం ఖాయం. కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలు, అవినీతిని ప్రజలంతా గ్రహించారు. కేసీఆర్ కుటుంబ పాలన, దోపిడీ, అరాచకాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పోలీసులు, స్టేషన్లు, జైళ్లు, లాఠీలు.. మాకు కొత్త కాదు. ఎంపీ పట్ల పోలీసుల ప్రవర్తన దారుణంగా ఉంది.’ అని బండి సంజయ్ అన్నారు.