బండి సంజయ్ పాదయాత్ర వాయిదా

-

తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 9 వ తారీకు నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించాలని వ్యూహ రచన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాల పట్ల నిరసనగా బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్
Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

అయితే బండి సంజయ్ తలపెట్టిన… ఈ పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు కాసేపటి క్రితమే తెలంగాణ బిజెపి ఓ ప్రకటన ద్వారా తెలిపింది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు మరియు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర నేపథ్యంలో… బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్ర కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే ఈ వాయిదా పడిన పాదయాత్రను ఆగస్టు 24 నుంచి తిరిగి యథావిధిగా ప్రారంభించాలని బండి సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. కాగా అనారోగ్యం కారణంగా ఈటల పాదయాత్ర వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news