ప్రగతి భవన్ లో కేసీఆర్ కు ‘RRR’ సినిమా చూపిస్తాం : బండి సంజయ్

ప్రగతి భవన్ లో తెలంగాణ సిఎం కేసీఆర్ కు ‘rrr’ సినిమా చూపిస్తామని హెచ్చరించారు బిజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వచ్చే నెల 2 తరువాత కేసీఆర్ దుకాణం బంద్ కావడం ఖాయమన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షు లు ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. దళిత బంధు పై హుజూరాబాద్ నుండే బీజేపీ యుద్దం ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు. సిఎం కేసీఆర్ చేసిన అన్ని సర్వేల్లో బీజేపీ గెలుస్తుందని ఖాయమై పోయిందని స్పష్టం చేశారు. ఓటుకు రూ.20 వేల పంచేందుకు కంటైనర్లలో డబ్బుల కట్టలు తీసుకొచ్చారని ఆరోపణలు చేశారు.

టీఆర్ఎస్ నేతలే ఓటుకు 15 వేలు కట్ చేసుకుని రూ.5 వేలే ఇస్తున్నరట… అవి కూడా దొంగ నోట్లు ఇస్తరేమో జాగ్రత్త అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు ఓటేయాలంటూ పోలీసులతో బెదిరించి భయపెడుతున్నారని.. ప్రజలెవరూ భయపడకండి అంటూ భరోసా కల్పించారు. స్వేచ్ఛగా ఓటేయండి… పువ్వు గుర్తుకు ఓటేసి కేసీఆర్ కు గుణపాఠం చెప్పండి అంటూ ప్రజలను కోరారు. వచ్చే నెల 2న హుజూరాబాద్ ప్రజల దెబ్బకు టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కావాలని పిలుపునిచ్చారు.