శీతాకాలం లో ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయి. చాలా మందికి సహజంగా దగ్గు మరియు జలుబు వంటి సమస్యలు ఉంటాయి. అయితే శీతాకాలం అవి మరింత పెరుగుతాయి. అటువంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే సీజనల్ ఫ్రూట్స్ ను తప్పకుండా తినాల్సి ఉంటుంది. శీతాకాలంలో రోగ నిరోధక శక్తి ను పెంచడానికి ఈ రెండు ఫ్రూట్స్ ని తీసుకోవడం ఎంతో అవసరం అని గుర్తుంచుకోండి. మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడే చూద్దాం.
కమలా పండ్లు:
ఇవి ఎంతో జ్యూసీగా, తియ్యగా మరియు పుల్లగా ఉంటాయి. శీతాకాలంలో కమలా పండ్లు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు మీరు పొందవచ్చు. రుచితో పాటు మీకు ఎంతో అవసరం అయ్యేటు వంటి పోషక విలువలు మరియు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కమలా పండ్లు తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. కనుక తప్పక దీనిని రోజూ తీసుకుంటూ వుండండి.
దానిమ్మ పండ్లు:
ఈ పండ్లలో విటమిన్ సి తో పాటు విటమిన్ ఈ కూడా పుష్కలంగా ఉంటుంది. అదే విధంగా వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. శీతాకాలంలో వ్యాపించే జబ్బులు నుండి దూరంగా ఉండాలి అని అనుకుంటే దానిమ్మ పండ్లను తీసుకోవడం చాలా అవసరము.
కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ ను తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.