ముగిసిన టీఆర్ఎస్ ప్లీనరీ.. ఏడు తీర్మానాలకు ఆమోదం

పార్టీ స్థాపించి 20 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఇవాళ అట్టహాసంగా ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించింది అధికార టీఆర్ఎస్ పార్టీ. మాదాపూర్ లో ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ ప్లీనరీ సమావేశం… కాసేపటి క్రితమే ముగిసింది. దాదాపు ఎనిమిది గంటలపాటు సాగిన టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం లో… ఏకంగా 7 తీర్మానంపై చర్చ నిర్వహించి ఆమోదం తెలిపింది. బీసీ జనగణన, ఎస్సీ వర్గీకరణ, చేయాలనే తీర్మానాలకు ఆమోదం తెలిపింది టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం.

అలాగే పార్టీ బైలాస్ లో పలు సంస్కరణలకు ప్లీనరీ ఆమోదం తెలిపింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అందుబాటులో లేకపోతే… వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహించేలా మార్పు చేస్తూ తీర్మానం చేసింది ప్లీనరీ. రాష్ట్ర కార్యవర్గ గాన్ని, జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు కు అధికారం రాష్ట్ర అధ్యక్షుడు ఉండేలా బైలాస్ సవరణలు చేసింది టీఆర్ఎస్ ప్లీనరీ. ఇక అంతకు ముందు… టిఆర్ఎస్ పార్టీ నీ మధ్యకి అడిగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను ఎన్నిక కు ఆమోదం తెలిపింది టీఆర్ఎస్ ప్లీనరీ. ఈ నేపథ్యంలో 9 వ సారి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు టిఆర్ఎస్ పార్టీ నేతలకు మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్.