ఖమ్మంలో కమలం వికసిస్తుందని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారిపోయిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీకి అధికారం ఇచ్చిన ప్రజలు ఇప్పుడు బీజేపీకి అధికారం ఇవ్వాలని చూస్తున్నారన్నారని బండి సంజయ్ ఖమ్మం సభలో అన్నారు. ఖమ్మానికి ప్రత్యేక చరిత్ర ఉందంటూ.. ఉద్యమాల గడ్డ, పౌరుషాల గడ్డని అన్నారు బండి సంజయ్. కేసీఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన ఘనత ఖమ్మం జిల్లాకే దక్కిందన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. మోసం చేయడంలో కేసీఆర్ ను మించిన వాళ్లెవరూ లేరని అన్నారు. మోసం అనే సబ్జెక్టులో కేసీఆర్ పీహెచ్ డీ చేశారని వ్యంగ్యం ప్రదర్శించారు. కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్ అని అన్నారు. నాడు ఎన్టీఆర్ టికెట్ ఇవ్వకపోడంతో ఆయనను ఆకట్టుకునేందుకు కొడుకు అజయ్ రావు పేరును కేటీఆర్ గా మార్చాడని విమర్శించారు. “రాష్ట్ర ముఖ్యమంత్రిది ఒక్కటే లెక్క… ఒక పెగ్ వేస్తాడు… ఇంటికో ఉద్యోగం అంటాడు, రెండు పెగ్గులు వేస్తాడు… డబుల్ బెడ్రూం ఇళ్లు అంటాడు, మూడు పెగ్గులు వేస్తాడు… దళితులకు మూడెకరాలు అంటాడు, నాలుగు పెగ్గులు వేస్తాడు… దళిత బంధు అంటాడు, ఐదు పెగ్గులు వేస్తాడు… నేను ఏమీ అనలేదంటాడు. అలాంటి వాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎలా భరిస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని? ఈ ముఖ్యమంత్రి పేరు ఎక్కడన్నా చెబితే ఉన్న గౌరవం కూడా పోతుంది అని అన్నారు.