హైదరాబాద్ రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏబీవీపీ మహిళ నేతని లేడీ కానిస్టేబుల్స్ జుట్టు పట్టుకుని ఈడ్చేశారు ఈ ఘటనపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సీరియస్ అయ్యారు. సభ్య సమాజం అసహించుకునేలా లేడీ కానిస్టేబుల్ వ్యవహరించారని చెప్పారు ఏబీవీపీ మహిళా నేతని జుట్టు పట్టుకుని ఈడ్చుకు వెళ్లడం ఏమిటని అడిగారు ప్రజా సమస్యలపై పోరాడితే ఇలానే వ్యవహరిస్తారా అని ఫైర్ అయ్యారు. పోలీసులు వెంటనే న్యాయ విచారణ జరపాలని అన్నారు.
బాధ్యులు పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు బిఆర్ఎస్ తనపై చేస్తున్న ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు ఎంపీగా వేలాది కోట్లు తీసుకువచ్చానన్నారు రోడ్ల కోసమే 8000 కోట్లు తీసుకువచ్చానని అన్నారు. అయితే తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ ఉండాలి అన్నారు మోడీ లేని భారత్ ని ఊహించుకోలేమని అన్నారు.