తీన్మార్ మల్లన్న అరెస్ట్.. బండి సంజయ్ సీరియస్

-

తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ అరెస్ట్ లను తీవ్రంగా ఖండిస్తున్నానని బండి సంజయ్ ట్వీట్ చేశారు. పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడి, వెంటనే వారిని విడుదల చేయాలని, లేనిపక్షం లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం జరిగిందని వెల్లడించారు. తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ అరెస్ట్ దుర్మార్గం. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని అనుకుంటున్నారు. దొంగల్లా వచ్చి ఎత్తుకుపోతారా ? అని నిలదీశారు.


ఖబడ్దార్ కేసీఆర్, వీరందరినీ బేషరతుగా విడుదల చేయాల్సిందే. జర్నలిస్ట్ విఠల్ ఆరోగ్యం బాగోలేదు, తనకు ఏం జరిగినా కేసీఆర్ దే బాధ్యత వహించాలి. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు పట్టిన గతి ఇదేనా ?
కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతోంది. తెలంగాణ ఉద్యమకారులారా, ఇప్పటికైనా బయటకురండి, కల్వకుంట్ల కుటుంబ రాక్షస పాలనపై పోరాడుదామని చెప్పారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news