కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ నుండి తరిమికొట్టాలి : బండి సంజ‌య్

-

కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ నుండి తరిమికొట్టాలని.. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌లు కూడా అనుకుంటున్నార‌ని బండి సంజ‌య్ అన్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా మద్యం టెండర్లు జరిగిన క‌ల్వ‌కుంట్ల వారే వెళ్తున్నారని… తాగి తాగించుతూ 50 వేల కోట్లు దండుకుంటున్నారని నిప్పులు చెరిగారు.

వరి కుప్పల మీద రైతులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారని.. అప్పుడు ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు ఉద్యోగం కోసం ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీఎం కావాలనే కొత్త సమస్యలు సృష్టిస్తున్నార‌ని.. కేసీఆర్ చైనా ను పొగుడుతూ మాట్లాడారని మండిప‌డ్డారు. హోం గార్డ్ కి కూడా పోస్టింగ్ ఇవ్వలేని వ్యక్తి హోం మినిస్టర్ అని… ఎమ్మెల్సీ కావాలని అనుకుంటున్న కలెక్టర్ లు సీఎం ఏది చెబితే అది చేస్తున్నారని ఆగ్ర‌హించారు. అందరికి అవకాశం ఇచ్చారు… బీజేపీ కో ఒక సారి ఇవ్వండి అని ప్ర‌జ‌ల‌ను కోరారు బండిసంజ‌య్‌. కేసీఆర్ ని వదిలి పెట్టె ప్రసక్తే లేదని… కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు అసలే సహించరని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news