జగన్ సర్కార్ పై చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. ఏపీకి పోలవరం, అమరావతి ప్రాజెక్టులు రెండు కళ్ళు అని.. కానీ ఆ రెండు కళ్ళను పొడిచేశారని నిప్పులు చెరిగారు చంద్రబాబు. రివర్స్ టెండరింగ్ వల్ల ఏం సాధించారు? ప్రజలు కూడా ఆలోచించాలని నిప్పులు చెరిగారు. అమరావతి విషయంలో యూ టర్న్ తీసుకున్నారని… ఎన్నికలకు ముందు అమరావతిని ఆహ్వానిస్తున్నాం అని చెప్పి గెలిచిన తరువాత మాట మార్చారని ఆగ్రహించారు.
ప్రజావేదిక నుంచి విధ్వంసం మొదలు పెట్టారని… అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే అనుమతులు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు. జగన్ కు రాష్ట్రం అంటే ప్రేమ లేదని.. డబ్బులు లూటీ చేయడమే పని అంటూ ఆగ్రహించారు. పోలవరం ప్రాజెక్టును అధోగతి పాలు చేసే పరిస్థితి వచ్చిందని.. 5 ఏళ్ళల్లో పోలవరం ప్రాజెక్టు 70 శాతం పూర్తి చేశానని వెల్లడించారు. తెలంగాణాలోని ముంపు మండలాలను ఏపీలో విలీనం చేస్తేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని కేంద్రానికి స్పష్టం చేశానని.. దీంతో ఉన్నపళంగా ప్రాజెక్టు అడ్డంకులు తొలగిపోయాయన్నారు. 2020 లోనే ప్రాజెక్టు పూర్తి అయి ఉండేదని తెలిపారు.