అసెంబ్లీలో “ఆర్ఆర్ఆర్” సినిమా చూపిస్తాం : టిఆర్ఎస్ కు బండి సంజయ్ వార్నింగ్

-

అసెంబ్లీ లో టిఆర్ఎస్ పార్టీ కి “ఆర్ ఆర్ ఆర్” సినిమా చూపెడుతామని… ట్రిపుల్ ఆర్ అంటే రాజా సింగ్, రఘునందన్, రాజేందర్ అన్నట్లని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రచారం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. కాషాయపు కంకణం కట్టుకుందాం కమలం పువ్వును గెలిపిద్దామని పిలుపునిచ్చారు.

కరెన్సీ నోట్ కు కమలం పువ్వుకు మధ్య జరుగుతున్న యుద్ధం ఈ హుజురాబాద్ ఎన్నిక అని పేర్కొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈటల బోళా మనిషి అని.. . ఈటలను మోసం చేస్తే పాపం తగులుతదన్నారు.
హుజురాబాద్ లో తెరాస కు డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమన్నారు బండి సంజయ్. సీఎం కెసిఆర్ కు సూటిగా సవాలు విసురుతున్నా. హుజురాబాద్ లో తెరాస ఓడిపోతే సీఎం రాజీనామా చేస్తారా ? అని సవాల్ విసిరారు. హుజురాబాద్ ఎన్నిక వాయిదా వేయడానికి ఎన్నికల కమిషన్ దగ్గర పెట్టుకున్న అర్జీలను చింపి చెత్త బుట్టలో వేశారని ఫైర్ అయ్యారు. దళిత బంధు బ్యాంకు అకౌంట్ లను ఎలా ఫ్రీజ్ చేస్తారు ? అని నిలదీశారు బండి సంజయ్.

 

Read more RELATED
Recommended to you

Latest news