సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘ఎలా ఉన్నావు అన్న మీ పరామర్శ మాకు కొండంత బలం తెలియని ఆనందం ఎంతో సంతోషం ధన్యవాదాలు అన్నగారు’ అంటూ పేర్కొన్నాడు.
ఎలా ఉన్నావు అన్న మీ పరామర్శ మాకు కొండంత బలం తెలియని ఆనందం ఎంతో సంతోషం ధన్యవాదాలు అన్నగారు@KChiruTweets 🙏🙏
— BANDLA GANESH. (@ganeshbandla) July 21, 2020
అలాగే ‘కష్టంతో పైకి వచ్చిన వాళ్లకి కష్టం తెలిసిన వాళ్లకి, ఏ అండా లేకుండా కొండగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకి మనసు, ప్రేమ, అనురాగం ఆప్యాయతలు ఉంటాయన్నందుకు మీరే ఉదాహరణ. యావత్ ఇండస్ట్రీ మిమ్మల్ని చూసి నేర్చుకుంటే బాగుంటుంది. వందేళ్లు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని వరుస ట్వీట్లు చేసారు బండ్ల గణేష్.
కష్టంతో పైకి వచ్చిన వాళ్ళకి కష్టం తెలిసిన వాళ్లకి ఏ అండ లేకుండా కొండగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మనసు ప్రేమ అ అనురాగం ఆప్యాయతలు ఉంటాయన్న అందుకు మీరే ఉదాహరణ యావత్ ఇండస్ట్రీ మిమ్మల్ని చూసి నేర్చుకుంటే బాగుంటుంది అన్న ఆశ వందేళ్లు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.@KChiruTweets గారు
— BANDLA GANESH. (@ganeshbandla) July 21, 2020
తీన్‌మార్ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారిన బండ్ల గణేష్ ఆపై గబ్బర్ సింగ్, ఇద్దరమ్మాయిలతో, గోవిందుడు అందరివాడేలే వంటి చిత్రాలను నిర్మించాడు. నిర్మాతగా మెగా హీరోలతోనే ఎక్కువగా కలిసి పని చేశాడు. తాజాగా బండ్లన్న కరోనాతో పోరాడి విజయం సాధించిన విషయం తెలిసిందే.