తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జాతీయ రాజకీయాల పేరుతో.. టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మార్చిన సంగతి తెలిసిందే. ఇవాళ ఢిల్లీలో brs పార్టీ కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అయితే కెసిఆర్ స్థాపించిన ఈ జాతీయ పార్టీ ఏపీలోనూ పోటీ చేస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే దీనిపై వైయస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను ఎవరు టచ్ చేయలేరని… సీఎం కేసీఆర్ పార్టీకి కూడా అంత సీన్ లేదని విజయమ్మ పేర్కొన్నారు. ముందు తెలంగాణలో కేసీఆర్ పార్టీ గెలవాలని చురకలంటించారు. తెలంగాణలో బాగు చేయకముందే ఏపీలో పర్యటిస్తే, ఏం వస్తుందని ప్రశ్నించారు వైఎస్ విజయమ్మ. ఏపీలో బి ఆర్ ఎస్ పార్టీ కి అసలు మనుగడ ఉండదని విజయమ్మ స్పష్టం చేశారు.