స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. దీనితో ప్రజలకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. అయితే దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ ని తీసుకు రావడం జరిగింది. దీనితో కస్టమర్స్ కి ఇది మరెంత ప్రయోజనకరంగా ఉంటుంది. దసరా పండుగ నేపథ్యంలో రుణ గ్రహీతలకు ఊరట కలిగే ప్రకటన ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే…
దసరా పండుగ నేపథ్యంలో రుణ గ్రహీతలకు ఊరట కలిగించే నిర్ణయాన్ని స్టేట్ బ్యాంక్ తీసుకుంది. దీనితో లోన్ తీసుకున్న వాళ్లకి ఇది ప్లస్ అవుతుంది. వివిధ రకాల రుణాలపై ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉంచింది బ్యాంక్. కార్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 7.25 శాతం నుంచి మొదలు అవుతుంది.
అదే ఒకవేళ పర్సనల్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 9.6 శాతం నుంచి మొదలు అవుతుంది. అదే విధంగా బంగారంపై రుణాలు తీసుకుంటే వడ్డీ రేటు 7.5 శాతం నుంచి మొదలు అవుతుంది. అదే కాకుండా పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, కార్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. లోన్ తీసుకోవడానికి ఎస్‌బీఐ యోనో ద్వారా రుణాల కోసం అప్లై చెయ్యచ్చు. కనుక లోన్ తీసుకోవాలని అనుకునే వారికీ ఇదే మంచి అవకాశం.