హుజూరాబాద్ బైపోల్.. పోటీలో ఎంతమందో తేలేది నేడే..

హుజూరాబాద్ లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య విమర్శ ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్నాయి. అయితే పోటీలో ఎంతమంది ఉంటారనే దానిపై మాత్రం నేడు స్పష్టత రానుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 13 చివరి రోజు కావడంతో బరిలో ఎంతమంది ఉంటారనే దానిపై ఉత్కంఠత నెలకొంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల విత్ డ్రాకు సమయం ఉంది. 

హుజూరాబాద్ ఎన్నికల్లో మొత్తం 61 మంది నామినేషన్లను దాఖలు చేస్తే వీటిలో నిబంధనలకు అనుగుణంగా లేని 18 మంది నామినేషన్లను ఎన్నికల అధికారులు ఇటీవల తిరస్కరించారు. దీంతో 43 మంది హుజూరాబాద్ బరిలో ఉన్నారు. నేడు నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ఎంత మంది తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకుంటారో చూడాలి. 16 మంది కన్నా ఎక్కువ మంది బరిలో ఉంటే ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో ఈవీఎం లను ఏర్పాటు చేయనున్నారు.