సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు ఇవ్వనున్న సెలవుల జాబితాను ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసింది. సెలవులు పెద్దగా లేకపోయినప్పటికీ ప్రతి 2, 4వ శనివారాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఇక మిగిలిన రోజుల్లో బ్యాంకులకు అందిస్తున్న సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి. వీటిల్లో ఆర్‌బీఐ ఇచ్చిన సెలవులు కాకుండా ఆయా రాష్ట్రాల్లో ఇచ్చే సెలవులు వేరేగా ఉంటాయి. వాటి గురించి ఆయా రాష్ట్రాల వాసులకు తెలుస్తుంది.
సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు ఇచ్చే సెలవుల వివరాలు…
* సెప్టెంబర్ 2 – శ్రీ నారాయణ గురు జయంతి
* సెప్టెంబర్ 6 – ఆదివారం
* సెప్టెంబర్ 12 – రెండో శనివారం
* సెప్టెంబర్ 13 – ఆదివారం
* సెప్టెంబర్ 17 – మహాలయ అమావాస్య
* సెప్టెంబర్ 20 – ఆదివారం
* సెప్టెంబర్ 21 – శ్రీ నారాయణ గురు సమాధి అయిన రోజు
* సెప్టెంబర్ 26 – నాలుగవ శనివారం
* సెప్టెంబర్ 27 – ఆదివారం
పైన తెలిపిన రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. అయినప్పటికీ వినియోగదారులు మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంల సేవలను ఉపయోగించుకోవచ్చు.