ఆ బ్యాంకు కస్టమర్లకు శుభవార్త.. రూ.10 లక్షల వరకు లాభం..!

కస్టమర్స్ కి ప్రభుత్వ రంగ బ్యాంకుఅయిన యూసీఓ బ్యాంకు గుడ్ న్యూస్ చెప్పింది. 79వ దినోత్సవం సందర్భంగా ప్రీమియం కస్టమర్లకు కొత్త సేవలని ఇస్తున్నట్టు తెలిపింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. యూసీవోబ్యాంకు రూపే కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌కార్డులను ఎంపిక చేసింది.

రూపే సెలెక్ట్ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ తీసుకు రావడం జరిగింది. బ్యాంక్ తన ప్రీమియం కస్టమర్ సెగ్మెంట్ కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI )తో కలిసి UCO బ్యాంక్ దీనిని తీసుకు వస్తోంది. దీని వలన ఎన్నో లాభాలు వున్నాయి అని బ్యాంక్ అంది. అయితే ఈ కార్డు ద్వారా వినియోగదారులు POS లేదా ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో రూ. 2 లక్షల వరకు కొనుగోళ్లు చేసుకోచ్చు.

అలానే ఏటీఎం నుండి డబ్బులని డ్రా చేసుకోవాలంటే విత్‌డ్రాయల్‌ పరిమితి రూ. 50,000 వరకు ఉండనుంది. వాటితో పాటుగా జిమ్ సభ్యత్వం, దేశీయంగా అంతర్జాతీయ లాంజ్ వరకు ప్రీమియం సౌకర్యాలను కూడా కస్టమర్స్ పొందొచ్చు అని బ్యాంక్ తెలిపింది. ఈ కార్డ్‌లో ప్రతి నెలా రెండు ఉచిత డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ని పొందొచ్చు.

5 నగరాల్లోని 25 కంటే ఎక్కువ విమానాశ్రయాల లాంజ్‌లకు ఉచిత ప్రవేశం కూడా. సెలెక్ట్ డెబిట్ కార్డ్ అనేది మీ మెరుగైన జీవితం కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు. కస్టమర్ రూ. 10 లక్షల వరకు బీమా రక్షణను పొందుతారు.

అలానే ఈ కార్డు ద్వారా ఒక సంవత్సరంలో కాంప్లిమెంటరీ గోల్ఫ్ కోచింగ్ కూడా పొందొచ్చు. ప్రతి సంవత్సరం రెండు ఉచిత అంతర్జాతీయ లాంజ్‌లను ఉపయోగించుకునే సౌకర్యం ఉంది. 300 నగరాల్లో 500కి పైగా లాంజ్‌లకు యాక్సెస్ ఉంటుంది. అదే విధంగా అన్ని రూపే సెలెక్ట్ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ హోల్డర్లు రూ.10 లక్షల వరకు బీమా కూడా పొందే అవకాశం వుంది.