ఉద్యమకారులను ఎలా తొక్కాలని కేటీఆర్ ను అడగాలి : #ASKKTR పై షర్మిల సెటైర్లు

-

మంత్రి కేటీఆర్ నిర్వహించిన ఆస్క్ కేటీఆర్ ప్రోగ్రామ్ పై వైఎస్ షర్మిల సెటైర్లు పేల్చారు. తెలియనిది అడిగితే పాపం KTR ఏమని సమాధానం చెప్తారు? అసలు అడగాల్సింది.. మద్యం అమ్మకాలను పెంచడం ఎలా? ఆడవాళ్ల మానప్రాణాలకు హాని కలిగించడం ఎలా? జనాలను డ్రగ్స్ కు బానిస చెయ్యడం ఎలా?రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం ఎలా? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనేలా చేయడం ఎలా? అనే ప్రశ్నలు అడగాలని చురకలు అంటించారు వైఎస్ షర్మిల.

దళితులను మోసం చేయడం ఎలా? వరి వేసిన వాళ్లకు ఉరి వేయడం ఎలా ? ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టడం ఎలా ? ఉద్యమకారులను తొక్కేయడం ఎలా ? ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించడం ఎలా ? పార్టీ లీడర్లు తప్పులు చేస్తే కాపాడుకోవడం ఎలా ? వీటికైతే బాగా సమాధానం చెప్పగలరు కదా చిన్న దొరగారు? అంటూ ఓ రేంజు లో ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. కాగా ఆస్క్ కేటీఆర్ సేషన్ ను ట్విటర్ లో నిన్న కేటీఆర్ నిర్వహించారు. అయితే ఆ ప్రోగ్రానికి షర్మిల కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news