ఎఫ్​డీ రేట్లను పెంచిన బ్యాంకులు.. ఏ బ్యాంక్ లో ఎంత వడ్డీ అంటే..?

-

బ్యాంకులు వడ్డీ రేట్లని మారుస్తూ ఉంటాయి. ఒక్కో సారి బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీ రేట్లని పెంచితే.. మరోసారి ఎఫ్డీలపై వడ్డీ రేట్లని తగ్గించచ్చు. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్​డీఎఫ్​సీ, కోటక్​ మహీంద్రా బ్యాంకులు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లని 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లని 10 బేసిస్ పాయింట్ల వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్​డీఎఫ్​సీ, కోటక్​ మహీంద్రా పెంచాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీలపై వడ్డీ రేటు పెంపు వర్తిస్తుందని అన్నాయి.

 

స్టేట్ బ్యాంక్ వడ్డీ రేట్లని చూస్తే… ఏడాది నుంచి 2 ఏళ్ల కంటే తక్కువ కాల వ్యవధి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.0 శాతం నుంచి 5.1 శాతానికి వడ్డీ రేటు పెంచింది. రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు ఎఫ్‌డీపై 5.10 శాతం వడ్డీ అందజేస్తుంది. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు 5.30 శాతం వడ్డీ రేటు ఆఫర్​ చేస్తుంది. జనవరి 15 నుంచి ఇవి వర్తిస్తుందని చెప్పింది. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ లభిస్తుంది.

అదే హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ అయితే 7 నుంచి 14 రోజుల వరకు 2.50%, 15- 29 రోజుల వరకు 2.50%, 30 నుంచి 90 రోజుల వరకు 3%, 91 రోజుల నుంచి 6 నెలల వరకు 3.5%, 6 నెలల నుంచి ఏడాది వరకు 4.4%, ఏడాది నుంచి రెండేళ్ల వరకు 5% ఇలా వున్నాయి. ఇవి జనవరి 12 నుంచి వర్తిస్తాయి.

అదే విధంగా కోటక్ మహేంద్ర బ్యాంక్ కూడా వడ్డీ రేట్లని పెంచింది. వాటి వివరాల లోకి వెళితే.. 7 నుంచి 30 రోజుల వరకు 2.50%, 31 రోజుల నుంచి 90 రోజుల వరకు 2.75%, 91 నుంచి 120 రోజుల వరకు 3% ఉండగా.. 365- 389 రోజుల వరకు 4.9%, 390- 391 రోజుల వరకు 5%, 392 రోజుల నుంచి రెండేళ్ల వరకు 5.10%, రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు 5.15%, మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు 5.3% వడ్డీ రేటుని ఇస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news