సంక్రాంతి ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీకి రూ.107 కోట్ల ఆదాయం

-

సంక్రాంతి పండుగ నేపథ్యంలో… రెండు రాష్ట్రాల ప్రయాణికులకు మంచి సేవలు అందించడమే కాకుండా… అదే రీతిలో వారం రోజుల వ్యవధిలోనే భారీ ఆదాయాన్ని ఆర్జించింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే ఈ ఘనత సాధించింది ఈ సంస్థ. సంక్రాంతి సందర్భంగా అదనంగా 55 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ.

షెడ్యూల్ బస్సుల తో పాటు అదనం గా 4 వేల బస్సులు నడిపిన సంస్థ… ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా సేవలు అందించింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ. అంతే కాదు ఏకంగా రూ. 107 కోట్ల ఆదాయం రాబట్టింది. అయితే ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ వీసీ సజ్జనార్ ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ తరఫున ప్రయాణికులకు కృత జ్ఞతలు తెలిపారు. ముందు ముందు కూడా ఇలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీని ప్రయాణికులు ఆదరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news