స్టేట్ బ్యాంక్ లో రోజుకు రూ. రూ.33 పొదుపు చేస్తే… రూ.1,60,000 పొందొచ్చు..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలని ఇస్తుంది. వీటి వలన కస్టమర్స్ కి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే స్టేట్ బ్యాంక్ అందించే సేవల్లో సేవింగ్ స్కీమ్స్ కూడా ఒకటి. ఎస్‌బీఐ పలు రకాల పథకాలు ఆఫర్ చేస్తోంది. వీటిల్లో రికరింగ్ డిపాజిట్ RD సేవలు కూడా ఇస్తోంది స్టేట్ బ్యాంక్.

 

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. స్టేట్ బ్యాంక్ ఆర్‌డీ స్కీమ్‌ లో చేరడం వల్ల తక్కువ పొదుపుతోనే మెచ్యూరిటీ కాలం లో ఆకర్షణీయ రాబడి పొందొచ్చు. అయితే దీనిని పొందాలంటే ప్రతీ నెలా డబ్బులు కడుతూ ఉండాలి. తర్వాత మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి డబ్బులు పొందొచ్చు. ప్రతీ రోజు కొంచెం కొంచెం డబ్బులు దాచుకునే వాళ్లకి ఈ స్కీమ్ బాగుంటుంది.

ఆ తరవాత ఒకేసారి డబ్బుల్ని పొందొచ్చు. ఈ స్కీమ్ లో మీరు రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి ఏమి లేదు. ఈ స్కీమ్ లో కనుక మీరు నెలకు రూ.1000 చొప్పున అంటే రోజుకు దాదాపు రూ.33 పొదుపు చేసి పదేళ్లు పాటు ఇన్వెస్ట్ చేస్తే మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.1.6 లక్షలు వస్తాయి. 5.4 శాతం వరకు వడ్డీ వస్తుంది.

కనీసం ఏడాది వరకు అయిన టెన్యూర్ ఎంచుకోవాలి. గరిష్టంగా పదేళ్ల వరకు డబ్బులు దాచుకోవచ్చు. ఒకసారి మీరు ఈ ఖాతాని తెరిచాక డబ్బు చెల్లించకపోతే చార్జెస్ పడతాయి గమనించండి. ఈ పథకంలో చేరిన వారికి నామినేషన్ సదుపాయం కూడా ఉంటుంది. అదే విధంగా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని కూడా పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news