ఇలా రూ.340తో రూ.4 లక్షల బెనిఫిట్ పొందండి..!

మీకు స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ ఉందా..? అయితే మీకు గుడ్ న్యూస్. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వీటి వలన కస్టమర్స్ కి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అయితే స్టేట్ బ్యాంక్ లో ఖాతా ఉంటే ఏడాదికి రూ.342తో ఏకంగా రూ.4 లక్షల వరకు పొందొచ్చు. ఇక దీని కోడం పూర్తి వివరాల లోకి వెళితే..

 

SBI
SBI

కేంద్ర ప్రభుత్వం రెండు రకాల ఇన్సూరెన్స్ స్కీమ్స్‌ను ఇస్తోంది. వీటి వలన బెనిఫిట్ గా ఉంటుంది. ఇక ఆ స్కీమ్స్ గురించి చూస్తే.. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన PMSBY, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY స్కీమ్. అయితే ఈ స్కీమ్స్ ఎస్‌బీఐ కస్టమర్లకు కూడా అందుబాటులో వున్నాయి. ఈ విషయాన్నీ ట్విట్టర్ వేదికగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన ద్వారా అయితే ప్రమాద బీమా వస్తుంది. ఒకవేళ కనుక పాలసీదారుడు మరణిస్తే ఆ డబ్బు నామినీకి ఇస్తారు. దీనికి ఏడాదికి రూ.12 కట్టాలి. 18 నుంచి 70 ఏళ్ల వయసు కలిగిన ఈ స్కీమ్ కి అర్హులు. ఇది ఇలా ఉంటే జీవన్ జ్యోతి బీమా యోజన అనే స్కీమ్ కూడా ఒకటి వుంది.

స్కీమ్ ద్వారా కూడా రూ.2 లక్షల జీవిత బీమా వస్తుంది. పాలసీదారుడు మరణిస్తే నామినీకి లేదా కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు ఇస్తారు. ఏడాదికి రూ.330 కట్టాలి. 18 నుంచి 50 ఏళ్ల వయసు కలిగిన వారు అర్హులు. ఆటో డెబిట్ ఫీచర్ కనుక తీసుకుంటే ప్రతి సంవత్సరం రూ.342 డబ్బులు బ్యాంక్ అకౌంట్ నుంచే కట్ అవుతాయి.