ఇలా సులభముగా ఇంటి నుండే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోచ్చు…!

ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కొత్త సేవలని తీసుకురావడానికి సిద్ధం అవుతోంది. ఇంటి నుంచే బీమా కొనుగోలు చేయడానికి కస్టమర్లకు వీలు కల్పిస్తోంది. అందుకే గూగుల్ పేతో పార్టనర్ షిప్ ని కుదుర్చుకుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. గూగుల్ పే యాప్‌లోనే ఎస్‌బీఐ జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కస్టమర్స్ తీసుకోచ్చు.

 

ఇది ఇలా ఉంటే ఇండియా లో బీమా ప్రొవైడర్‌తో గూగుల్ పే భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఇదే ఫస్ట్ టైం. దీని వలన కస్టమర్స్ కి బెనిఫిట్ గా ఉంటుంది. గూగుల్ పే స్పాట్ లోనే క్షణాల్లో ఆరోగ్య బీమాను కొనుగోలు చేసుకోవచ్చు. ఇప్పటికి కాలం లో డిజిటల్ పేమెంట్స్ పెరగడం.. టెక్నాలజీని వాడడం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఇది కూడా వినియోగదారులు పొందొచ్చు.

అలానే దీని వలన లాభం కూడా. ఆరోగ్య బీమా కోసం పెరుగుతున్న ఈ అవసరాన్ని పరిష్కరించడానికి ఈ సహకారం మరొక ప్రయత్నం. ముందు దీనిని తీసుకువస్తే ఆ తరవాత ఎక్కువ సంఖ్యలో వ్యక్తులను బీమా పరిధిలోకి తీసుకురావడంకి కుదురుతుంది అని దీనిని మొదలు పెట్టారు.

గూగుల్ పే యూజర్లు ఎస్‌బీఐ కొత్తగా అందిస్తున్న సేవలతో గూగుల్ పే స్పాట్‌లో ఎస్‌బీఐ జనరల్ ఆరోగ్య బీమా అయిన ఆరోగ్య సంజీవనిని కొనుగోలు చేయవచ్చు. ఇది అతి తక్కువ ప్రీమియంలతో స్టాండర్డ్ కవరేజీని ఇస్తుంది. యూజర్లు గూగుల్ పే స్పాట్ ద్వారా ఆరోగ్య సంజీవని పాలసీ కింద వ్యక్తిగత, కుటుంబ ప్లాన్‌లను కూడా తీసుకోవడానికి అవుతుంది.