SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్..ఇలా చేస్తే ఈజీగా రుణాన్ని పొందవచ్చు..

-

ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.ఇప్పుడు క్షణాల్లో లోన్ ను పొందే అవకాశాన్ని అందించింది.ఆ ఫెసిలిటీస్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…కేవలం 4 పద్దతుల ద్వారా లోన్ ను ఎలా పొందవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్యాంక్ ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్

కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ సౌకర్యాన్ని బ్యాంక్ అందజేస్తోందని, అందులో మీరు నిమిషాల్లో మీ అవసరానికి అనుగుణంగా లోన్ తీసుకోవచ్చని బ్యాంకు వెల్లడించింది. కేవలం 4 క్లిక్‌లతో ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ పొందవచ్చని తెలిపింది. YONO యాప్/ఆన్‌లైన్ SBI ద్వారా ఈ తక్షణ రుణాన్ని పొందవచ్చని బ్యాంక్ అధికారులు తెలిపారు..

బ్యాంక్ రిజిస్టర్‌ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ చెయ్యండి..

ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మరింత సమాచారం కోసం మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి ఒక SMS మాత్రమే చేయాలి. మీరు మీ ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్‌ను కేవలం 4 క్లిక్‌లలో పొందవచ్చని బ్యాంక్ ట్వీట్‌లో తెలిపింది. ఇది కాకుండా మీరు YONO, OnlineSBI ద్వారా కూడా పొందవచ్చు. ఈ పని కోసం మీరు బ్యాంకు బ్రాంచ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని మీ పని పూర్తి చేసుకోవచ్చు. మీకు అర్హత ఉంటే బ్యాంకు వెంటనే రుణాన్ని పొందవచ్చు..

రుణాన్ని సులువుగా ఎలా పొందాలి?

మీరు ముందుగా YONO యాప్‌కి లాగిన్ కావాలి. ఆ తర్వాత Avail now పై క్లిక్ చేయండి. రుణ మొత్తాన్ని ఎంచుకోండి. చివరగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని నమోదు చేయండి. దీని తర్వాత బ్యాంకు మీ వివరాలను పరిశీలించి అర్హత ఉంటే డబ్బు మీ ఖాతాలో జమ చేస్తుంది..బ్యాంక్ వెళ్ళి గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన పనిలేదు..

Read more RELATED
Recommended to you

Latest news