ఆగస్టు ఒకటి నుండి బ్యాంకింగ్, ఫైనాన్స్ ఇతర విభాగాల్లో కొత్త రూల్స్.. వివరాలివే..!

-

ఆగస్టు నుండి బ్యాంకింగ్ ఫైనాన్స్ మరియు ఇతర విభాగాల్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ రూల్స్ ని కనుక చూస్తే మారిన అంశాల గురించి మీరు క్లుప్తంగా తెలుసుకోవచ్చు. తదుపరి నెల నుండి అంటే రేపటి నుండి రాబోతున్న మార్పులు ఇవే..

ఏటీఎం క్యాష్ విత్డ్రాల్స్ లో మార్పులు:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ATM క్యాష్ విత్‌డ్రాయల్స్ లో కొత్త రూల్స్ రానున్నాయి. జూన్ నెలలో వచ్చిన ఆర్డర్ ప్రకారం చూస్తే.. ఇంటర్‌ఛేంజ్ ఫీజు నిర్మాణం రూ 15 నుండి రూ 17 కి పెరిగింది. అయితే ఆర్‌బిఐ ప్రకటించిన ప్రకారం ఆగస్టు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. తొమ్మిదేళ్ల తర్వాత ఈ ఇంటర్‌ఛేంజ్ ఫీజులు పెంచబడ్డాయి.

ఐసిఐసిఐ బ్యాంక్ ఛార్జీలు:

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసిఐ ఆగస్టు నుండి కొత్త రూల్స్ తీసుకొస్తోంది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం బ్యాంకులో రెగ్యులర్ సేవింగ్స్ ఎకౌంట్ వున్న కస్టమర్లకు నాలుగు ఉచిత లావాదేవీలు ఇస్తోంది. ఒకవేళ కనుక పరిమితి దాటితే ట్రాన్సక్షన్ కి రూ 150 కట్టాల్సి వుంది.

IPPB డోర్ స్టెప్ బ్యాంకింగ్ చార్జీలు:

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) డోర్‌స్టెప్ సేవలకి సంబంధించి అప్డేట్ ని ఇచ్చింది. ఆగస్టు నుండి ఈ రూల్స్ అమలులోకి రానున్నాయి. IPPB డోర్‌స్టెప్ సేవ కోసం ప్రతీసారి ఇరవై రూపాయిలు (జీఎస్టీ) కూడా కట్టాలి. ఇది ఆగస్టు 1 నుండి వర్తిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఎలాంటి చార్జెస్ లేవు. ఒకవేళ ఎక్కువ మంది ఈ సేవలని ఉపయోగిస్తే అది ప్రత్యేక DSB డెలివరీగా పరిగణించబడుతుంది. అందుకే చార్జీలు వసూలు చేస్తోందని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అంటోంది.

గ్యాస్ సిలెండర్ ధరలు:

అంతర్జాతీయ మార్కెట్లలో వుండే ముడి చమురు ధరను బట్టి ప్రతి నెలా ప్రారంభంలో LPG సిలిండర్ ధరల్ని ఇంధన కంపెనీలు మారుస్తూ వుంటారు. అందుకే మీరు ఆగస్టు నెలలో LPG సిలిండర్ బుక్ చేసే ముందు ఒకసారి ధర చెక్ చేసుకోండి.

 

Read more RELATED
Recommended to you

Latest news